సింహం గడ్డి తింటుందా, నిజమా?

సింహాలు, పులులు, జునాగఢ్, సక్కర్‌బాగ్ జూ పార్క్, వైరల్ వీడియో

ఫొటో సోర్స్, HANIF KHOKHAR

ఫొటో క్యాప్షన్, సింహం గడ్డి తింటున్న వైరల్ వీడియోలు చూసి జనం ఆశ్చర్యపోయారు.
    • రచయిత, అపూర్వ అమిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

"ఆకలేసినా సింహం గడ్డి తినదు" అనే నానుడి వినే వింటారు.

అయితే, జునాగఢ్‌లోని సక్కర్‌బాగ్ జూ పార్కులో సింహాలు, పులులు గడ్డి తింటున్న వైరల్ వీడియోలు చూసి జనం షాకయ్యారు.

ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, 2019లో ఒక ఏసియన్ సింహం గడ్డి తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

సింహాలు నిజంగా గడ్డి తింటాయా? లేదంటే, అలా యాదృచ్ఛికంగా జరిగిందా? లేక ఫేక్ న్యూసా? అని చాలామంది సందేహిస్తుంటారు. కానీ, నిజానికి అసలు పరిస్థితి వేరు.

సింహాలు, పులులు సహా చాలావరకు ఫెలైన్స్(పిల్లి జాతి జంతువులు) అప్పుడప్పుడు గడ్డి తింటాయి.

మాంసాహారులుగా పేరున్న ఈ సింహాలు, పులులు ఎందుకు గడ్డి తింటాయి? శాస్త్రీయ కారణాలేంటి? వీటిపై వన్యప్రాణి నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సింహం నిజంగానే గడ్డి తిన్నదా?

అడవికి రారాజుగా పిలిచే సింహం మాత్రమే కాకుండా పులి కూడా గడ్డి తింటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో కనిపించింది.

సాధారణంగా ఎవరైనా జూ లేదా అటవీ సందర్శనకు వెళ్లినప్పుడు సింహం గడ్డి తినడం కంటపడితే, వాటికి సరిపడినంత ఆహారం దొరక్క గడ్డి తినాల్సి వస్తోందని భావిస్తుంటారు.

అయితే, అటవీ శాఖ అధికారి చెప్పిన దాని ప్రకారం, ఆ భావన పూర్తిగా తప్పు. జంతువులు గడ్డి తినడం అనేది ఒక సహజ ప్రక్రియ.

సింహం, పులి, చిరుతపులి, పిల్లి జాతికి చెందిన జంతువులు 'ఆబ్లిగేట్ కార్నివోర్స్'(కచ్చితమైన మాంసాహారులు) అని, అవి పూర్తిగా మాంసాహార జన్యువులు కలిగి ఉంటాయని జునాగఢ్‌లోని సక్కర్‌బాగ్ జూ డైరెక్టర్ రాజ్‌దీప్ సింగ్ ఝాలా చెప్పారు.

"అవి శాకాహారం తినవు, కానీ అప్పుడప్పుడు గడ్డి తింటాయి."

సింహాలు, పులులు, జునాగఢ్, సక్కర్‌బాగ్ జూ పార్క్, వైరల్ వీడియో

ఫొటో సోర్స్, HANIF KHOKHAR

"మనుషులు ఎలాగైతే జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు ఇసబ్‌గోల్, చియా సీడ్స్ వంటి పీచుపదార్థాలను(ఫైబర్) తీసుకుంటారో, అదే విధంగా సింహాలు, పులులకు గడ్డి పీచుపదార్థంలా పనిచేస్తుంది" అని ఆయన చెప్పారు.

"గడ్డిలో ఫైబర్‌ ఉంటుంది. సాధారణంగా అవి రోజూ గడ్డి తినవు. కాకపోతే, వర్షాకాలంలో కొన్నిసార్లు తింటాయి.

ఇది వాటి పేగుల్లో కదలికలను ప్రేరేపిస్తుంది, దీంతో జీర్ణక్రియ సులభతరం అవుతుంది.

మరికొన్నిసార్లు గొంతులో మంటగా అనిపించడం లేదా కడుపులో ఇబ్బందిని తగ్గించుకోవడానికి గడ్డి తిని, జీర్ణంకాని అదనపు ఆహారాన్ని వాంతి చేసుకుంటాయి.

ఆసియా సింహాలు (ఇతర మాంసాహార వన్యప్రాణులు) అప్పుడప్పుడూ గడ్డి తింటాయి. కానీ అవి ఆహారంగానో, పోషకాల కోసమో తినవు."

సింహాలు, పులులు, జునాగఢ్, సక్కర్‌బాగ్ జూ పార్క్, వైరల్ వీడియో

ఫొటో సోర్స్, HANIF KHOKHAR

నిపుణులు ఏమంటున్నారు?

మాంసాహార జంతువుల శరీరంలో మాంసం శాతం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వాటి ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటుందని భక్త కవి నరసింహ్ మెహతా యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ వైల్డ్‌లైఫ్ అండ్ కన్జర్వేషన్ స్టడీస్ డైరెక్టర్ నిశిత్ ధారయా బీబీసీతో చెప్పారు.

"అందువల్ల, శరీరంలో ఫైబర్ లోపించినప్పుడు కొన్నిసార్లు జంతువులు గడ్డి లాంటి ఏదో ఒకటి తింటాయి."

"ఆసియా సింహాలు, పులుల వంటి మాంసాహార జంతువులన్నీ ఫైబర్ కోసం గడ్డి తింటాయి. ముఖ్యంగా, సింహాలు ఈ కాలంలో ఎక్కువగా గడ్డి తింటాయి. ఎందుకంటే, వాటి శరీరానికి ఎక్కువ ఫైబర్ అవసరం. ఇది వాటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది."

"అప్పుడప్పుడూ, సింహాలు బాగా గడ్డి తిని వాంతి చేసుకుంటాయి."

సింహాలు, పులులు, జునాగఢ్, సక్కర్‌బాగ్ జూ పార్క్, వైరల్ వీడియో

ఫొటో సోర్స్, HANIF KHOKHAR

కుక్క గడ్డి తినగలదా?

పులులు, సింహాలు, పిల్లి వంటి అన్ని మాంసాహార జంతువులు గడ్డి తినగలవని వన్యప్రాణుల ప్రవర్తనపై అధ్యయనం చేస్తున్న నిపుణుడు వివేక్ అవస్థి బీబీసీతో చెప్పారు.

"కుక్కలు కూడా గడ్డి తినగలగడానికి కారణం, గడ్డి ఆ జంతువులు గొంతు లోపలికి లోతుగా వెళ్లడమే.

దానివల్ల, అవి వికారంతో వాంతి చేసుకుంటాయి. అందుకే సింహాలు, పులులు కడుపునొప్పిగా ఉన్నప్పుడు లేదా జీర్ణ సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే గడ్డి తింటాయి."

"దీంతో వాటి కడుపులో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చేస్తాయి."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)