వీధి వ్యాపారిని వెంటాడి, పరుగులు తీయించిన డ్రోన్ చివరికి...
వీధి వ్యాపారిని వెంటాడి, పరుగులు తీయించిన డ్రోన్ చివరికి...
ప్రచురణ
ఒక వ్యక్తిని డ్రోన్ తరుముతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ.. పౌరులపై రష్యా జరుపుతున్న 'సఫారీ' దాడులకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
ఖేర్సన్ ప్రాంతంలోని ఒక వీధిలో ఒక చిరువ్యాపారిని ఆ డ్రోన్ వెంటాడుతున్నట్లుగా జెలియెన్‌స్కీ షేర్ చేసిన వీడియోలో కనిపిస్తోంది. పైన తిరుగుతున్న డ్రోన్ నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అక్కడే ఉన్న ఒక తెల్లటి వ్యాన్ చుట్టూ ఆ వ్యక్తి పరిగెత్తారు.
అప్పటికీ ఆయననే తరిమిన ఆ డ్రోన్ చివరకు ఆయన పైకి దూసుకొచ్చి ఒక్కసారిగా పేలడం వీడియోలో చూడొచ్చు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









