28 గేదెలను ఒక్కడే రక్షించాడు.. పోటెత్తిన నదిలో పొక్లెయిన్‌తో రెస్క్యూ ఆపరేషన్

వీడియో క్యాప్షన్, నదిలో చిక్కుకున్న గేదెను కాపాడారిలా
28 గేదెలను ఒక్కడే రక్షించాడు.. పోటెత్తిన నదిలో పొక్లెయిన్‌తో రెస్క్యూ ఆపరేషన్
ప్రచురణ

నదీ ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయిన గేదెలను జేసీబీ సాయంతో ఇలా రక్షించారు.

గుజరాత్‌లో సురేందర్ నగర్‌ జిల్లాలోని జొరావర్ నగర్ దగ్గర భుగావో నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో దాదాపు 30 గేదెలు ప్రవాహం మధ్యలో చిక్కుకుపోయాయి.

ఒక స్థానిక యువకుడు జేసీబీ సాయంతో దాదాపు 28 గేదెలను ఇలా సురక్షితంగా కాపాడాడు.

ఈ రెస్క్యూలో స్థానికులు, జంతు ప్రేమికులు కూడా సహకారం అందించారు.

గేదెలను కాపాడిన యువకుడికి స్థానికులు సత్కారం చేశారు.

"భుగావో నదిలో దాదాపు 30 గేదెలు చిక్కుకుపోయాయి. వాటిని నేను, మా గ్రూప్ సభ్యులందరూ కలిసి విజయవంతంగా రెస్క్యూ చేశాం. ఇలా ఇంకోసారి జరగకుండా అందరం జాగ్రత్త తీసుకోవాలి. రెండు గేదెలు చనిపోయాయి 28 గేదెలను విజయవంతంగా రెస్క్యూ చేశాం" అని గేదెలను కాపాడిన నీరవ్ భాయ్ చెప్పారు.

అహ్మదాబాద్, గేదె రెస్క్యూ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)