ఇరాన్ దాడులతో అమెరికా స్థావరాలకు తీవ్రనష్టం జరుగుతోందా? రహస్యంగా విడుదలైన 9 ఫోటోలు ఏం చెబుతున్నాయంటే...

అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద తీసిన ఒక ఫోటోను సీబీఎస్ సంపాదించింది. అందులో 4 ఇంజన్ల బోయింగ్ ఏ-3 సెంటినల్ విమానం వెనుక భాగం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

మధ్యప్రాచ్యంలోని అనేక అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి, డ్రోన్ దాడులకు సంబంధించిన తాజా ఫోటోలను బీబీసీ అమెరికా భాగస్వామి సంస్థ సీబీఎస్ న్యూస్ విడుదల చేసింది.

మొదటిసారిగా బయటకు వచ్చిన ఈ ఫోటోలు దాడుల్లో అమెరికాకు జరిగిన నష్ణం తీవ్రతను చూపిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలోని అనేక అమెరికా సైనిక స్థావరాల్లో భవనాలు, వాహనాలు దెబ్బతిన్న తీరు ఈ ఫోటోలలో కనిపిస్తుంది.
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, ఈ ప్రాంతాల్లోకి మీడియా ప్రవేశంపై కఠినమైన ఆంక్షలు ఉండడంతోత తమ గుర్తింపును గోప్యంగా ఉంచాలనే షరతుపై అమెరికా సైనిక సిబ్బంది ఈ ఫోటోలను సీబీఎస్‌కు పంపారు.
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమాన్, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, మరికొన్ని చిత్రాల్లో, సైనిక భవనాలు, బ్యారక్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. గతంలో గ్రెనేడ్‌లు, మోర్టార్ దాడుల నుంచి రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ "టి-వాల్" నిర్మాణాలు ఈ వైమానిక దాడులను ఎదుర్కోలేకపోయినట్టు ఫోటోల్లో కనిపిస్తోంది.
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో సుమారు 3.7 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సామగ్రి నష్టం జరిగింది. ఇందులో దాదాపు 60 విమానాలు కూడా ఉన్నాయని నివేదిక పేర్కొన్నట్టు అమెరికా రక్షణ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ వారం విడుదల చేసిన నివేదికలో ఉంది.
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, కువైట్‌లోని క్యాంప్ బ్యూహ్రింగ్ వద్ద విధ్వంసానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అమెరికా సైన్యానికి కీలక కేంద్రంగా ఉన్న ఈ స్థావరంలో సైనికులు, సాయుధ వాహనాలు, కొన్ని విమానాలు ఉంటాయి.
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, " దారి తప్పి వచ్చిన క్షిపణులు చేసిన దాడులు కావు ఇవి. మా స్థావరాలను మేం రక్షించలేకపోతున్నాం. ధ్వంసమవుతున్న వాటిని చూస్తూ ఉండిపోతున్నాం" అని అక్కడే ఉన్న ఒక సైనికుడు వ్యాఖ్యానించారు.
అమెరికా, ఇరాన్, గల్ఫ్, దాడులు, ప్రతిదాడులు

ఫొటో సోర్స్, CBS News

ఫొటో క్యాప్షన్, "ఇది మా సైనిక స్థావరాలకు తీరని నష్టం, దీని గురించి అమెరికా ప్రజలకు తెలియదు. మేం కళ్లు మూసుకుని అక్కడ నిలబడి దెబ్బలు తింటున్నాం " అని దాడులపై ఆ ప్రాంతంలో మోహరించిన సైనికుల్లో ఒకరు వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)