BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
తెలంగాణ కులగణన: ఏ కులం బాగా వెనుకబడింది, ఏ కులం తక్కువ వెనుకబడింది?
విద్య, వృత్తి, ఆదాయం, స్థిరాస్తులు, జీవన స్థితిగతులు, లింగ భేదం, సామాజిక వివక్ష, విద్యాసంస్థల్లో చేరికలు.. ఇలా వివిధ అంశాల ఆధారంగా ప్రభుత్వం కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్ (సీబీఐ)ను నిర్ణయించింది. దీని ఆధారంగా 0 నుంచి 126 మధ్య స్కోర్ (మార్కులు) కేటాయించింది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే, అంత వెనుకబడిన కులంగా భావిస్తారు.
లోక్‌సభ: వీగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, మూడింట రెండువంతుల మెజారిటీ సాధించలేకపోయిన ఎన్డీయే
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్ట సవరణ, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చర్చ అనంతరం హోం మంత్రి అమిత్ షా స్పందించగా, దానిపై ఓటింగ్ జరిగింది.
'అప్లై చేసిన 2 నిమిషాల్లోనే రిజెక్ట్ చేశారు': ఏఐ ఇంటర్వ్యూల ద్వారా జాబ్ సంపాదించడం కష్టమా?
భారీ సంఖ్యలో వస్తున్న అప్లికేషన్లను వడపోసేందుకు కంపెనీలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఈ ప్రక్రియలో తిరస్కరణల గురించి ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గంటకు 60 నిముషాలే ఎందుకు ఉంటాయి, ఇలా ఉండాలని ఎవరు చెప్పారు? చరిత్రలో ఏం జరిగింది...
సుమేరియన్లు సంఖ్యలను నమోదు చేయడానికి ఇప్పటి స్మార్ట్ ఫోన్ సైజు లేదా అంతకంటే చిన్నగా ఉండే మట్టి పలకలు ఉపయోగించడం ప్రారంభించారు. మెత్తటి బంక మట్టి అచ్చుల మీద వివరాలను ముద్రించేవారు.
హైదరాబాద్: ‘ఆ వాటర్ ట్యాంక్ నా జీవితాన్నే మార్చేసింది’
నా లైఫ్‌లో ఈ వాటర్ ట్యాంక్ లేకపోతే నేను లేను అంటున్నారు వెన్నెల. ఆమె ఓ రీసర్చ్ ఇంజనీర్. తండ్రి సెక్యూరిటీ గార్డు, తల్లి టీ బండి నడుపుతారు. తాను ఇంత ఉన్నతస్థాయికి చేరడానికి వాటర్ ట్యాంకే కారణమంటున్నారు వెన్నెల. ఇంతకీ ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఏం జరుగుతోంది? వెన్నెలలాంటి వారికి ఆ ట్యాంక్ ఎలా అండగా నిలుస్తోంది.
బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ రివ్యూ: చాలా గ్యాప్ తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?
ప్రేక్షకుడు కమర్షియల్ సినిమాలో భారీ థ్రిల్స్, ఊహకందని సన్నివేశాల్ని కోరుకుంటున్నాడు. కానీ, విలన్ ఆట కట్టించడానికి కమెడియన్ని క్లైమాక్స్‌లో తీసుకురావడం శీను వైట్ల కాలంనాటి టెంప్లేట్. దాన్ని ఇందులో పెట్టారు.
‘‘చనిపోయిన అమ్మ కలలో కనిపించి టెస్టులు చేయించుకొమ్మని చెప్పకపోతే, నా క్యాన్సర్ సంగతి బయటపడేది కాదు’’
మూడేళ్ల కిందట చనిపోయిన తన తల్లిని తలుచుకుంటూ అడిలైన్ డిప్రెషన్‌తో బాధపడేవారు. "నాకింకా గుర్తుంది. ఓ రోజు రాత్రి మా అమ్మ నాకు కలలో కనిపించింది. 'అమ్మా.. ఎట్టకేలకు నిన్ను కలిశాను, ఎలా ఉన్నావు?' అని అడిగా. అందుకు ఆమె 'నేను బానే ఉన్నాను, కానీ నీకొక విషయం చెప్పాలి. వీలైనంత త్వరగా వైద్య పరీక్షలు చేయించుకో' అని చెప్పారు.
ఇరాన్ - అమెరికా : తదుపరి అడుగు ఎటువైపు? భవిష్యత్తును తేల్చే 4 కీలక పరిణామాలు ఏమిటి?
ఇరాన్, అమెరికా మధ్య ఎలాంటి ఒప్పందం కుదరకుండానే మొదటి దశ చర్చలు విఫలం కావడం, మరోసారి చర్చలు జరిగే అవకాశముందా అనే విషయాలను ఎలా చూడాలి? ఇరుదేశాలు పరిమిత ఉద్రిక్తతల దిశగా పయనిస్తున్నాయా? లేదంటే, విస్తృత స్థాయి యుద్ధానికి దిగబోతున్నాయా? వీటి మధ్యన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? ప్రస్తుత కాల్పుల విరమణ వ్యూహాత్మకమేనా?
వీడియో, హార్ముజ్ జలసంధి: ఇరాన్‌కు నౌకల నుంచి టోల్ వసూలు చేసే హక్కు ఉందా?, వ్యవధి 3,23
ఓడల రవాణాపై దిగ్భంధం విధించే హక్కు అమెరికాకు ఉంటుందా? అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఏం చెబుతున్నాయి?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































