BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
భారత్ వర్సెస్ ఇంగ్లండ్: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు.. తొలి మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశాడంటే..
అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. పురుషుల క్రికెట్లో అత్యంత తక్కువ వయసులోనే భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా నిలిచి, సచిన్ తెందూల్కర్ రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.
ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలు, షార్క్ చేపల వేట... హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడ్డాయా?
ఘర్షణలను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదేపదే హెచ్చరిస్తూ, ఈ జలసంధిని తిరిగి తెరవకపోతే ‘ఇరాన్ అనే దేశమే మిగలదని’ హెచ్చరించారు. అయినా ఈ బెదిరింపులు, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇరాన్ ఈ జలసంధిని పూర్తిగా తెరవలేదు. శాశ్వత శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్‌కు ఇదొక ‘బేరమాడే శక్తి’.
పదేళ్ల బాలుడికి 20 రకాల అలర్జీలు, వాటి చికిత్స కోసం 8వేల కిలోమీటర్ల ప్రయాణం
యాన్ చిన్నతనంలో తీవ్రమైన తామర వ్యాధి బారిన పడ్డాడు. అతనికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడు చేసిన రక్త పరీక్షల్లో... పాలు, వేరుశెనగలు (పల్లీలు), గుడ్ల వల్ల అతనికి అలర్జీ వస్తున్నట్లు తేలింది. అయితే, 'కొన్ని రకాల పదార్థాలను తినిపించి పరీక్షించడం ద్వారా యాన్ కుటుంబం అతనికి ఉన్న మరిన్ని అలర్జీలను గుర్తించగలిగింది.
సీతాఫలం: తక్కువ నీటితో పెరిగే ఈ పంటకు విదేశాలలో ఎలాంటి డిమాండ్ ఉంది?
అయితే ఇలాంటి సున్నితమైన పండ్లను ఎగుమతి చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కోత సమయం, ప్యాకింగ్, రవాణా,, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రతి దశను ఖచ్చితంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత నియంత్రణ అత్యంత కీలకం. ఈ పండు వేడికి త్వరగా పాడైపోతుంది. కొద్దిపాటి వేడి తగిలినా నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది.
ఖమేనీ అంత్యక్రియలు ఇంత ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయి? ఆయన భౌతిక కాయాన్ని ఇరాక్ ఎందుకు తీసుకెళ్తున్నారు?
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన అయతొల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల భౌతిక కాయాలను ఇంతకాలం ఎలా భద్రపరిచారు? ఖననానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? ఆయన భౌతిక కాయాన్ని ఇరాక్ ఎందుకు తీసుకెళ్తున్నారు?
వివిధ దేశాలకు ఆయిల్ అమ్ముతున్న రష్యాలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు ఎందుకు? భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోందా?
ప్రపంచంలోని అనేక దేశాలకు చమురును విక్రయిస్తున్న రష్యా, ఇప్పుడు స్వయంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారులుదీరుతున్నాయి. భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. అసలీ పరిస్థితికి కారణాలేంటి? క్రెమ్లిన్ ఏమంటోంది?
ఆమె మెదడులో 38 పురుగులు.. 'పందిమాంసం' తినడం వల్లే కావొచ్చంటున్న వైద్యులు
యూకేలో ఏడాదిలో ఇలా మెదడుకు సంబంధించిన వ్యాధి గుర్తించడం అరుదు. అలాంటి వారిలో లోరీ ఒకరు. పందిమాంసంలోని టేప్‌వార్మ్ లార్వా వల్ల ఇది సంక్రమిస్తుంది. టేప్‌వార్మ్ గుడ్లు ఉన్న పందిమాంసాన్ని లోరీ తిని ఉండొచ్చని ఆమె డాక్టర్ భావిస్తున్నారు.
చేతుల్లో పటుత్వం పోవడం, వెన్నెముక వంగిపోవడం.. మీ స్క్రీన్ టైమ్ మీ శరీరాన్ని ఎన్ని రకాలుగా మార్చేస్తోందో తెలుసా?
“ఫోన్ చూసేప్పుడు తలను బాగా కిందకు వంచుతుంటాం. దీని వల్ల మెడమీద 27 కేజీల భారం పడుతుంది. కాలక్రమేణా ఇది మన వెన్నెముకలోని డిస్క్‌లను దెబ్బతీయొచ్చు.”
'గంజాయిని పోస్టులో డోర్ డెలివరీ చేసే ముఠా', ఈ అక్రమ దందా ఎలా బయటపడిందంటే...
ఉత్తరాలు, పార్శిళ్లు పంపే ‘స్పీడ్ పోస్టు’ సేవలను వాడుకుంటూ దేశవ్యాప్తంగా సాగుతున్న ఒక భారీ గంజాయి రవాణా ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. అసలు తపాలా శాఖ కళ్లు గప్పి 21 రాష్ట్రాలకు ఈ దందా ఎలా సాగింది? వాట్సాప్ కోడ్ వర్డ్స్ వెనుక ఉన్న గుట్టేంటి?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
ది గ్రేట్ గామా : జీవితంలో ఓటమెరుగని మల్లయోధుడి కథ, 'రోజుకు ఆరు కోళ్లు తిని, 20 లీటర్ల పాలు తాగేవారు..'
జాన్ బుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు 1910లో, గామాను లండన్ పంపించారు. కానీ గామా పొట్టిగా ఉండడంతో ఆయన్ను అనర్హుడిని చేశారు. కానీ అక్కడే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం బరిలోకి దిగిన గామా లండన్‌లోని ప్రపంచ స్థాయి రెజ్లర్లకు సవాల్ విసిరారు. 5 నిమిషాల పాటు తన చేతిని పట్టుకోగలిగిన వారికి 5 పౌండ్లు ఇస్తానని ప్రకటించారు.
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































