‘యువత భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగించింది మీరే’.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఆరోపణ

ఫొటో సోర్స్, Getty Images
యువత సంక్షేమం, భవిష్యత్ కంటే ఏదీ ముఖ్యం కాదంటూ నరేంద్ర మోదీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై రాహుల్ గాంధీ స్పందించారు.
‘యువత భవిష్యత్తుకు తీవ్ర నష్టం కలిగించింది మీరే. విద్యావ్యవస్థను పూర్తిగా గుప్పిట్లోకి తీసుకుని, నాశనం చేయడానికి మీరే అనుమతించి ప్రోత్సహించారు. అందుకు బాధ్యులైన అందరినీ కాపాడారు’ అన్నారు.
విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి తప్పించాలని, విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, విద్యార్థులపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని రాహుల్ మూడు డిమాండ్లు చేశారు.



