You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అలుగు: ముట్టుకుంటే ముడుచుకునే ఈ జీవిని ఎందుకు వేటాడుతున్నారు?
పాంగోలిన్ లేదా అలుగు… ఇది పొలుసులతో, బంతిలా ముడుచుకుపోయే ఓ క్షీరదం. ఇప్పుడిది ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణాకు గురవుతున్న జీవి.
2000 నుంచి 2016 మధ్య అంతర్జాతీయంగా 10 లక్షలకు పైగా అలుగులు అక్రమ రవాణాకు గురైనట్లు అంచనా.
అలాగే 2016 నుంచి 2024 వరకు పట్టుబడిన అలుగు ఉత్పత్తులను బట్టి చూస్తే, ఈ కాలంలో కనీసం మరో 5 లక్షల అలుగులు అక్రమ రవాణాకు గురైనట్లు తెలుస్తోంది.
వీటి పొలుసులను సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు, వీటి మాంసాన్ని విలాసవంతమైన ఆహారంగా భావిస్తారు. ఫ్యాషన్ పరిశ్రమ కారణంగా అమెరికా కూడా వీటికి పెద్ద మార్కెట్‌గా మారింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)