పద్మశ్రీ అందుకున్న రోహిత్ శర్మ
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల పురస్కార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించాడు.
క్రికెట్లో దేశానికి అందించిన సేవలు గానూ రోహిత్ శర్మకు ఈ అవార్డు లభించింది.
అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ మెరుగైన ప్రదర్శన చేశాడు.
తొలి మ్యాచ్‌లో విఫలమైనా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటనలో జరిగే వన్డే సిరీస్‌తో రోహిత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, అవార్డు గ్రహీతలు హాజరయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









