యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక

‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. మురసు: ‘22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను’

    ఆంధ్రప్రదేశ్, మురసు తుపాను, నెల్లూరు,
    ఫొటో క్యాప్షన్, గడచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మురసు తుపాను

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు గురించి ఆంధ్రప్రదేశ్ విపత్తుల కేంద్రం, ఆర్టీజీఎస్ మరో అప్‌డేట్ ఇచ్చాయి. పది గంటలకు విడుదలైన బులెటిన్‌లో ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్టు పేర్కొన్నారు.

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారిన మురసు గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 22 కిలోమీటర్ల వేగంతో క‌దులుతున్నట్టు తెలిపాయి.

    ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని వివరించారు.

    తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరుకు 160 కిలోమీటర్లు, చెన్నైకి 180 కి.మీ, కావలికు 180 కి.మీ., ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో, మ‌చిలీప‌ట్నానికి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ ‘బీబీసీ’తో చెప్పారు.

  2. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ
    ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ

    హైదరాబాద్‌కు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై అధికారులు తాజాగా బులెటిన్ విడుల చేశారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు.

    హైదరాబాద్‌లో ఇవాళంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

    హైదరాబాద్‌లో గరిష్టంగా 33 డిగ్రీల ష్ణోగ్రత నమోదు అయితే కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని కూడా చెప్పింది.

  3. కడప, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లో 8 కేంద్రాల్లో రీపోలింగ్

    కడప, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లో 8 కేంద్రాల్లో రీపోలింగ్
    ఫొటో క్యాప్షన్, కడప, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లో 8 కేంద్రాల్లో రీపోలింగ్

    ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో పలు ప్రాంతల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలో 8 కేంద్రాల్లో రీపోలింగ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కడప నగరపాలక సంస్థ, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ (సోమవారం (నవంబర్ 2) రీపోలింగ్ జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

    కడప నగరపాలక సంస్థలోని 15వ వార్డు పరిధిలో పోలింగ్ కేంద్రం నంబర్ 15/2లో, జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 3వ, 17వ, 29వ వార్డులకు చెందిన 3/2, 17/1, 29/1 పోలింగ్ కేంద్రాల్లో, పులివెందుల మున్సిపాలిటీలోని 1, 3, 7, 8వ వార్డులకు చెందిన 1/1, 3/1, 7/1, 8/1 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టారు.

  4. ఆంధ్రప్రదేశ్‌కు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మురసు తుపాను కోసం ముందస్తు చర్యలు

    తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మురసు, నెల్లూరు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్,
    ఫొటో క్యాప్షన్, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

    తీవ్ర మురసు తుపాను ఈ అర్థరాత్రికి తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది.

    ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లను అధికారులు మోహరిస్తున్నారు.

    ఇందులో భాగంగానే మూడు ఎన్డీఆర్ఎస్ టీమ్‌లు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి.

    తమిళనాడులోని రాణిపేట్ జిల్లా, అరక్కోణం సమీపంలో ఉన్న నగరికుప్పం నుంచి ఈ బృందాలు బయల్దేరాయి.

    మురసు తుపాను ఈ అర్థరాత్రి ఒంగోలుకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

  5. మురసు తుపాను: తమిళనాడు సీఎం విజయ్‌కు ఫోన్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

    మురసు, ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు, నెల్లూరు, తమిళనాడు, విజయ్
    ఫొటో క్యాప్షన్, తుపానుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    మురసు తుపాను ముంచుకొస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

    సన్నద్ధతలో భాగంగా విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ సహాయం కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు.

    మురసు తుపాను వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ పోల్స్ దెబ్బ తింటాయని, పునరుద్ధరణకు సిబ్బందిని, యంత్రాలను పంపాలని కోరారు.

    దీనికి తమిళనాడు సీఎం దీనికి సానుకూలంగా స్పందించారని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’లో పేర్కొంది.

    ఇటీవలే విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సహాయం తీసుకుంది.

    విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సిబ్బందిని, సామగ్రిని పంపించింది. ఇప్పుడు తమిళనాడు సహాయం తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

  6. మురసు: ‘గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం’

    అర్థరాత్రి తీరం దాటనున్న మురసు
    ఫొటో క్యాప్షన్, అర్థరాత్రి తీరం దాటనున్న మురసు

    బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను సోమవారం అర్ధరాత్రి తరువాత ఒంగోలు వద్ద తీరం దాటనుందని ఐఎండీ పేర్కొంది.

    "పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను, గత 6 గంటలుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తూ, తీవ్ర తుపానుగా బలపడింది’ అని భారత వాతావరణ శాఖ తన ఎక్స్‌ ఖాతాలోపేర్కొంది.

    ‘నవంబర్ 2, 2026న తెల్లవారుజామున 2.30 గంటల సమయానికి, ఇది 13.6° ఉత్తర అక్షాంశం, 82.5° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నైకి (తమిళనాడు) తూర్పు-ఈశాన్యంగా సుమారు 260 కి.మీ, నెల్లూరుకు (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 290 కి.మీ, మచిలీపట్నానికి (ఆంధ్రప్రదేశ్) దక్షిణ-ఆగ్నేయంగా 320 కి.మీ, కావలికి (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ, ఒంగోలుకు (ఆంధ్రప్రదేశ్) ఆగ్నేయంగా 330 కి.మీ. విశాఖపట్నానికి (ఆంధ్రప్రదేశ్) దక్షిణంగా 470 కి.మీ దూరంలో ఉంది’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

    ఇది మరింతగా వాయువ్య దిశగా పయనించి, నవంబర్ 2 అర్ధరాత్రి (11.30 గంటలకు) నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున (4గంటల) మధ్య, నెల్లూరు, నర్సాపురం మధ్య ముఖ్యంగా ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

    ఈ సమయంలో గాలి వేగం గంటకు 100 నుంచి 110 కి.మీ వరకు ఉండి, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

  7. తీవ్ర తుపానుగా మారిన మురసు... కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన

    తీవ్ర తుపానుగా మారిన మురసు
    ఫొటో క్యాప్షన్, తీవ్ర తుపానుగా మారిన మురసు

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

    మురసు ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

    ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

    మురసు ప్ర‌స్తుతం చెన్నైకి 260 కి.మీ, నెల్లూరుకు 290 కి.మీ, మ‌చిలీప‌ట్నానికి 320 కి.మీ, కావలికి 310 కి.మీ, ఒంగోలుకు 330 కి.మీ, విశాఖ‌ప‌ట్నానికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఈ తుపాను నవంబర్ 3న తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటవచ్చని అధికారులు చెబుతున్నారు.

  8. రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు

  9. ముగిసిన ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్: పులివెందులలో ఉద్రిక్తత, వైసీపీ,టీడీపీ పరస్పర విమర్శలు

  10. క్లాస్ రూమ్‌లో రెండుగంటలపాటు గాయాలతో పడి ఉన్న ఆరేళ్ల బాలిక.. అబ్జర్వేషన్ హోమ్‌కు 8ఏళ్ల బాలుడు

  11. తరగతి గదిలో రంపంతో విద్యార్థినిపై దాడి: ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది, వైద్యులు ఏం చెబుతున్నారు?

  12. ఇండియా కూటమి ర్యాలీ : ‘ఓటు దొంగలను ఎక్కడికీ పోనివ్వం, చట్టం ముందు నిలబెడతాం’

  13. విద్యార్థుల బర్త్ డే పార్టీ : 'పోలీసు సైరన్ విని భయంతో పరుగులు, ఇద్దరు విద్యార్థుల మృతి’ - అసలేం జరిగింది?

  14. మురసు తుపాను: సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన రద్దు, అధికారులతో సమీక్ష

    నారా చంద్రబాబు నాయుడు

    పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశమున్న ‘మురసు’ తుపాను ప్రభావంపై ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంపై తుపాను ప్రభావం, వర్షాలు, గాలుల అంచనా, జలాశయాల పరిస్థితిపై చర్చించారు. మురసు తుపాను నేపథ్యంలో ఆయన తన దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.

    విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకారం..నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా. నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం

    • తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు
    • నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు.
    • నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
    • అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం ఉన్నాయి.
    • నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో సుమారు 179 మిల్లీ మీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చని అంచనా
    • బుడమేరు వద్ద నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం రావచ్చని అంచనా. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో భారీ వరదకు అవకాశం
    • బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ముందస్తు అంచనా
  15. ఏపీ వైపు ముంచుకొస్తున్న ‘మురసు’ తుపాను

    మురసు తుపాను

    బంగాళాఖాతంలో మురసు తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

    ప్రస్తుతం చెన్నైకి 560 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్లు, ఒంగోలుకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

    ఇది రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది.

    రేపు అర్ధరాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము మధ్య నెల్లూరు, నరసాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి తెలిపారు.

    తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  16. దిల్లీ: రామ్‌లీలా మైదాన్ వద్ద నేడు ప్రతిపక్షాల ర్యాలీ.. దిల్లీలో పరిస్థితిని చూపే 9 ఫోటోలు..

  17. రామ్‌లీలా: కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇక్కడ చేస్తున్న ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?

  18. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థలకు ప్రారంభమైన పోలింగ్

    92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
    ఫొటో క్యాప్షన్, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

    13 నగరపాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు), 79 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

    ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేయగా, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

  19. ‘భారత్‌లో పేదరికం తగ్గింది, కానీ..’

  20. ‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ