You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తమిళనాడులో 84.60, పశ్చిమ బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో 84.60 శాతం, బెంగాల్‌లో 91.68 శాతం పోలింగ్ నమోదైంది.

సారాంశం

  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
  • తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరిగింది.
  • పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
  • అమెరికా నేవీ సెక్రటరీ 'తక్షణమే' పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పెంటగాన్ ప్రకటన
  • డోనల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధ విరామ పొడిగింపుపై స్పందించిన ఇరాన్.
  • రాజకీయ పరిణామాలను తెహ్రాన్ నిశితంగా గమనిస్తోందని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. విజయ్: తమిళనాట 62 స్థానాలలో గెలిచి 45 సీట్లలో ఆధిక్యంలో ఉన్న టీవీకే.. కేరళలో యూడీఎఫ్ విజయం - బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ

  2. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- అందరి దృష్టి బెంగాల్‌పైనే

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

    నెల్లాళ్లపాటు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. పశ్చిమబెంగాల్లో అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు భారతీయ జనతాపార్టీ చావోరేవో అన్నట్టుగా తలపడ్డాయి.

    పశ్చిమబెంగాల్‌తోపాటు దక్షణాదిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి,ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోనూ ఎన్నికలు జరిగాయి. కానీ దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమబెంగాల్‌పైనే ఉంది.

    ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు పతాకశీర్షికలుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఓటర్ల జాబితా సవరణ కారణంగా దాదాపు 91 లక్షల ఓటర్లను తొలగించారు.

    ఇక నాలుగోసారి మమతాబెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది కూడా మే 4వ తేదీనే తేలిపోనుంది.

    మరోపక్క ఎలాగైన పశ్చిమబెంగాల్లో పాగా వేయాలని బీజేపీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తోంది. ఈసారి అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించింది.

    మరికొద్ది గంటల్లోనే ఫలితాలు తేలిపోనున్న తరుణంలో కోల్‌కతా నగరం ప్రశాంతంగా కనిపిస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట భద్రతను కట్టుదిట్టం చేశారు.

    మరోపక్క తాజాగా ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో మే 21న రీపోలింగ్ జరపనున్నట్టు ప్రకటించారు.

    ఈ నియోజకవర్గ ఫలితాన్ని మే 24న ప్రకటించనున్నారు.

    దీంతో మే 4వ తేదీ పశ్చిమబెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ, 293 స్థానాల ఫలితాలు మాత్రమే వెల్లడికానున్నాయి.

  3. 'బ్రిజ్ భూషణ్ ఇలాకాలో పోటీలా? ఆరుగురు బాధితుల్లో నేనూ ఒకరిని' : రెజ్లర్ వినేశ్ ఫొగాట్

  4. , గుడ్మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటు స్థానిక, జాతీయ,

    అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.