ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
"చాలా విషయాలు కల్పించారు లేదా అతిశయోక్తి జోడించారు. అందుకే నా సొంత కథను రాసి, వాస్తవాలను, జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నా"
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, Jacques Langevin/Sygma/Sygma via Getty Images
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, మాజీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తన రాబోయే ఆత్మకథ 'బిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్' గురించి ఒక వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.
రాజీవ్ గాంధీని దేశ ప్రధానిని చేస్తున్నప్పుడు తాను ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించానని, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడం తనకు అసలు ఇష్టం లేదని ఆ వీడియోలో ఆమె చెప్పారు.
వచ్చే నెల నవంబర్ 10న విడుదల కానున్న తన పుస్తకం గురించి, తన జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాల గురించి ఆమె ఈ వీడియోలో సూటిగా మాట్లాడారు.
"ఈ పుస్తకం బయటకు వచ్చినప్పుడు, కచ్చితంగా కొంత నాటకీయత చోటుచేసుకుంటుంది" అని తను పోస్ట్ చేసిన వీడియోకు క్యాప్షన్ పెట్టారు సోనియా గాంధీ.
"దశాబ్దాలుగా ఇతరులు నా కథ చెబుతూ వచ్చారు, ఇప్పుడు నావంతు వచ్చింది, నేను పూర్తి కథ చెప్పాలా వద్దా అన్నది నాకు తెలియదు, కానీ నా గురించి చాలా రాశారు, అందులో చాలా వరకు నిజం కాదని నాకు అనిపించింది" అని ఆమె పేర్కొన్నారు.
"చాలా విషయాలు కల్పించారు లేదా అతిశయోక్తి జోడించారు. అందుకే నా సొంత కథను రాసి, వాస్తవాలను, జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నా" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Kunal Patil/Hindustan Times via Getty Images
‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఆ నోటీసులో ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ), తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు మౌఖికంగా హామీ ఇచ్చారు.
తదుపరి విచారణ వరకు ఈ కేసులో తదుపరి చర్యలను కూడా కోర్టు నిలిపివేసింది.
ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్ఆర్ఆర్ఓ) అక్టోబర్ 14న జారీ చేసిన ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ నోటీసు జారీ చేసినట్లు ఎఫ్ఆర్ఆర్ఓ పేర్కొంది.

ఫొటో సోర్స్, ATTA KENARE / AFP via Getty Images
ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ “పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు” అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబా ప్రకటించారు.
“విప్లవ నాయకుడు (సుప్రీం లీడర్) ఆరోగ్యం గురించి నన్ను తరచూ అడుగుతున్నారు. ముజ్తబా ఖమేనీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని పార్లమెంట్ సభ్యులకు తెలియజేయాలనుకుంటున్నా” అని మంగళవారం పార్లమెంట్ సమావేశంలో వెల్లడించారు.
ఇటీవలి రోజుల్లో ముజ్తబా ఖమేనీని గాలిబా కలిశారని ఇరాన్ మీడియా వార్తలు ప్రచురించింది.
తన తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత ముజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అయితే అప్పటి నుంచి ఆయనకు సంబంధించిన వీడియో లేదా ఆడియో రికార్డింగ్ ఏదీ బహిరంగంగా విడుదల కాలేదు. ఇప్పటివరకు ఆయన పేరుతో విడుదలైన రాతపూర్వక సందేశాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.
భద్రతా కారణాల వల్లే ఆయన వీడియోలు, ఆడియోలు విడుదల చేయడం లేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ముజ్తబా ఖమేనీని రెండుసార్లు కలిశానని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా ఇటీవల తెలిపారు.

ఫొటో సోర్స్, Dinodia Photos/Getty Images
రిలయన్స్ జియో ఐపీఓ చుట్టూ ప్రస్తుతం నెలకొన్న ఈ సందడితో, 49 ఏళ్ల క్రితం తొలిసారి రిలయన్స్ గ్రూప్ తన ఐపీఓను ప్రారంభించినప్పుడు.. అప్పుడు వాతావరణం ఎలా ఉంది, దాని ద్వారా పెట్టుబడిదారులు ఎంత లాభం పొందారో తెలుసుకోవడం ఆసక్తికరం.
పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం-2023లోని కొన్ని నిబంధనలను పిటిషనర్లు సవాలు చేశారు.
డీఎన్‌పీఏలో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ది హిందూ, ఇండియా టుడే, టైమ్స్ గ్రూప్, జీ, ఎన్డీటీవీ, నెట్వర్క్ 18 సహా 21 ప్రముఖ వార్తా సంస్థల డిజిటల్ విభాగాలు ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనలు పత్రికా స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అసోసియేషన్ పేర్కొంది.
న్యాయపరమైన అంశాలను పరిశీలించే వెబ్సైట్ లైవ్ లా ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్లో డీపీడీపీ చట్టంలోని సెక్షన్లు 7, 17(2), 18, 19, 27, 29, 36, 37, 44(3)లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు.
అలాగే డీపీడీపీ నిబంధనలు-2025లోని రూల్స్ 16, 17, 23లను కూడా సవాలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది మాధవి దివాన్ ఈ వాదనలు వినిపించారు.
“ఈ నిబంధనల వల్ల న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి” అని ఆమె అన్నారు.
“డేటాకు సంబంధించిన వ్యక్తి అనుమతి ఇస్తేనే వార్తలను ప్రచురించాల్సిన పరిస్థితి వస్తే, వార్త అనేదే అంతమైపోతుంది. వార్తలు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి. ఈ నిబంధనల వల్ల న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి. ప్రతిదానికీ అనుమతి, ఆమోదం అడగాల్సి వస్తే ఇక వార్తలు ఎలా ప్రచురించగలం?” అని మాధవి దివాన్ ప్రశ్నించారు.

అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.
ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.
ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే
రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే

కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద తీరం దాటే హెచ్చరికలతో పాండిచ్చేరి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయలని ఆదేశాలు జారీ చేశారు.
రోడ్లపై జన సంచారం తగ్గించే చర్యల్లో భాగంగా యానాం అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఇవాళ సాయంత్రం నుంచి రెండు రోజులు పాటు యానాంలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
యానాంలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి 29వ తేదీ వరకు అన్ని వైన్ షాపులు, బార్లు, లిక్కర్ సరఫరా చేసే హోటల్స్ మూసి వేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.
ఈ తుపాను ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.
అర్నబ్ తుపాన్ వేళ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నెంబర్లను విడుదల చేశారు.
అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070 , 1800 425 0101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.

ఫొటో సోర్స్, @IPR_AP
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్దక రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఐఎండీడైరెక్టర్ కె. నాగరత్నం అన్నారు.
ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె... అర్నబ్ తుపాను అర్ధరాత్రి అత్యంత తీవ్ర తుపానుగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది 22 కిలోమీటర్ల వేగంతో కదిలుతుందని తెలిపారు.
తుపాను ప్రభావంతో వ్యవసాయం, పశుసంవర్దక, ఉద్యానవనం, రంగాలకు నష్టం ఉంటుందని వివరించారు. అలాగే రైలు, రోడ్డు, విమాన రవాణా సేవలపై కూడా ప్రభావం పడవచ్చని తెలిపారు.
తుపాను తీవ్ర దృష్ట్యా తీర ప్రాంతాల్లోని భూభాగ, సముద్ర కార్యకలాపాలను సమీక్షించి అవసరమైతే నిలిపివేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే అక్టోబర్ 27, 28 తేదీల్లో తూర్పు-మధ్య బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అర్నబ్ ప్రభావం విశాఖ, విజయవాడ విమాన సర్వీసులపై పడుతుందని ఎయిర్ ఇండియా హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తీవ్ర తుఫాన్ సమీపిస్తున్న సమయంలో ప్రయాణికులు తమ విమానాల స్టాటస్‌ను ముందుగానే పరిశీలించుకోవాలని ఎయిర్ ఇండియా సూచించింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణాపైనా ప్రభావం ఉండొచ్చని, అందువల్ల విమానాశ్రయాలకు సమయానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

అర్నబ్ తుపాను ప్రభావం విశాఖలో కనిపిస్తోందని బీబీసీ ప్రతినిధి లక్కోజు శ్రీనివాస్ తెలిపారు.
నిన్న సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పు కనిపించిందని పేర్కొన్నారు.
రాత్రి నుంచి గాలులు వీస్తుండగా, ఈ ఉదయం నుంచి వానలు పడుతున్నట్టు చెప్పారు.
తుపాను ప్రభావం తీవ్రంగ ఉంటుందని అధికారులు హెచ్చరించడంతో ప్రజలకు కూడా అప్రమత్తమయ్యారు. నిత్యవసరాలు కొనుగోలు చేసుకుంటున్నారు.
ఈ తుపాను ప్రభావం ఉండే శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.




ఫొటో సోర్స్, ANI
పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రతుపాన్ ‘అర్నబ్’ ప్రభావం ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌పై కనిపిస్తోంది. కొన్ని తీర ప్రాంతాల్లో వానలు జోరుగా పడుతున్నాయి. బలమైన గాలులు కూడా వీస్తున్నట్టు ఏఎన్ఐ వార్తప్రచురించింది.
ఖుర్ధా జిల్లా, పూరీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులుమొదలయ్యాయి.
దీని ప్రభావంతో పూరీ జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డట్టు ఏఎన్ఐ పేర్కొంది.
అర్నబ్ తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖాధికారుల హెచ్చరికలతో మూడు రోజు పాటు పడవ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ఒడిశా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బార్కులా మేనేజర్ సవ్యసాచి కారా ఏఎన్ఐకి చెప్పారు.
"మూడు రోజుల పాటు పడవల రాకపోకలను నిలిపివేశాం. మా సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నారు. అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మా వద్ద మొత్తం 10 పడవలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో మూడు సేవల్లో లేకపోయినా, అన్ని పడవలను సురక్షితంగా తీర ప్రాంతంలో ఉంచాం, ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలుల వేగం కూడా పెరిగింది. ఈ ఉదయం నుంచే వాతావరణం మరింత ప్రతికూలంగా మారింది" అని సవ్యసాచి కారా వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
ఎత్తైన అలలు ఎగసిపడుతుండగా, సముద్రం ఉద్ధృతంగా కనిపిస్తోందని ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తుపాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో గాలుల వేగం కూడా పెరిగిందని పేర్కొంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాన్ బుధవారం ఉదయం బాపట్ల- విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుఫాన్ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఫొటో సోర్స్, ANI
అర్నబ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద పర్యాటక బోటు సర్వీస్‌ను తాత్కాలికంగానిలిపేశారు.
ఒడిశాలోని చిలికా సరస్సులో పర్యాటక ఫెర్రీలు, ప్రయాణికుల బోటు సేవలను నిలిపేసిన అధికారులు వాటిని సురక్షిత ప్రాంతంలో ఉంచారు. అన్ని పడవులు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌లు, జెట్టీల వద్ద సురక్షితంగా కట్టి ఉంచినట్టు అధికారులు పేర్కొన్నారు.
తుపాను ప్రభావం తగ్గి వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్టు అధికారులు వెల్లడించారు.
22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అర్నబ్ తుపాను విశాఖకు 260 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాన్ అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ తుపాను విశాఖపట్నానికి 260కి.మీ., కాకినాడకు 300 కి.మీ., మచిలీపట్నంకు 390 కి.మీ., బాపట్లకు 460 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
దీని ప్రభావంతో కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు ఉంటాయని వెల్లడించింది. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్రత పెరగనుందని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, EPA/Shutterstock
సెర్బియాలో సుదీర్ఘ కాలంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు అలెక్సాండర్ వుచిచ్ ఎన్నికల్లో తన ఓటమినిఅంగీకరించారు.
కొద్దికాలంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి ఆయన తలవంచారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజధాని బెల్గ్రేడ్, నోవి సాడ్ సహా పలు నగరాల్లో ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి విజయోత్సవాలు చేసుకున్నారు.
అవినీతి, పరిపాలన నిర్లక్ష్యానికి నిరసనగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం ఈ ఎన్నికల్లో వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులతో బరిలోకి దిగి సంచలన విజయం నమోదు చేసింది.
ఈఎన్నికల్లో ఓడిపోయామని స్పష్టంగా తెలుస్తోందని రైట్ వింగ్ నాయకుడు వుచిచ్ తన ఓటమిని అంగీకరించారు.
97 శాతం పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. విద్యార్థులకు 22 లక్షల 50 వేల ఓట్లు లభించాయని, అధికార పార్టీకి 16 లక్షల 70 వేల ఓట్లు వచ్చినట్టు సెర్బియా ఎన్నికల కమిషన్ తెలిపింది.
ప్రాథమిక ఫలితాల ప్రకారం విద్యార్థుల నేతృత్వంలోని నిరసన ఉద్యమం 52.7 శాతం ఓట్లు సాధించగా, వుచిచ్‌కు చెందిన సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ 39.2 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.
వుచిచ్ ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేశారు. రాజ్యాంగ పరిమితుల కారణంగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వీలు లేకపోవడంతో 2017లో విడిచిపెట్టిన ప్రధానమంత్రి పదవిని తిరిగి దక్కించుకోవాలన్న లక్ష్యంతో తన పార్టీకి నాయకత్వం వహించారు.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అర్నబ్ తుపాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మంగళవారం వేకువజామున విడుదల చేసిన బులెటిన్‌లో.. విశాఖకు 300 కి.మీ., కాకినాడకు 360 కి.మీ., మచిలీపట్నానికి 460, బాపట్లకు 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు.
సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనమవుతుందని బులెటిన్‌లో వెల్లడించారు.
బుధవారం ఉదయం బాపట్ల -విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు.
అర్నబ్ తుపాను ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని జైన్ తెలిపారు. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఉంటాయని కూడా అంచనా వేశారు. కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అర్నబ్ తుపాను కదలికలపై భారత వాతావరణ శాఖ కూడా వేకువజామున 3 గంటలకు ఒక బులెటిన్ విడుదల చేసింది.
ఈ తుపాను మరింత బలపడి అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని పేర్కొంది. ఈ తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం, ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి