చనిపోయిన బిడ్డను మోసిన తల్లి డాల్ఫిన్.. డ్రోన్ దృశ్యాలు

వీడియో క్యాప్షన్, చనిపోయిన బిడ్డను మోసిన తల్లి డాల్ఫిన్.. డ్రోన్ దృశ్యాలు
చనిపోయిన బిడ్డను మోసిన తల్లి డాల్ఫిన్.. డ్రోన్ దృశ్యాలు
ప్రచురణ

మరణించిన పిల్లని మోస్తూ తిరుగుతున్న ఒక తల్లి డాల్ఫిన్ దృశ్యం ఇది. తన బిడ్డ శరీరాన్ని వదలకుండా, కొన్నిరోజుల పాటు మోస్తూ ఆ తల్లి ప్రవర్తించింది.

ఆస్ట్రేలియాకు చెందిన 'జియోగ్రాఫ్ మెరైన్ రీసెర్చ్' సంస్థ డ్రోన్ ద్వారా తీసిన ఈ వీడియోలో ఇతర డాల్ఫిన్‌ల గుంపు కూడా దాని చుట్టూ చేరిన దృశ్యాలు నమోదయ్యాయి.

డాల్ఫిన్‌లు తమ సంతాప ప్రక్రియలో భాగంగా చనిపోయిన పిల్లలను ఇలా కొద్దిరోజుల పాటు మోస్తుంటాయి.

అయితే తమ ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఆహారం కోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాటిని వదిలి ముందుకు సాగుతాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)